Header Banner

అష్టదిగ్బంధనంలో పాకిస్థాన్..! తాజాగా మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్!

  Sat May 03, 2025 07:57        India

రహదారులే రన్‌వేలు. హైవే మైవే అంటూ భారతీయ ఎయిర్‌ఫోర్స్‌ చేస్తున్న కసరత్తులు పాకిస్థాన్ హడలెత్తిస్తున్నాయి. దానికి తోడు పాకిస్తాన్‌ను ఆర్థిక మిస్సైళ్లతో అతలాకుతలం చేయడానికి భారత్‌ భారీ ప్లాన్‌ చేసింది. రెండంచెల చక్రవ్యూహంతో పాక్‌ని ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పహల్గామ్‌ ఉగ్ర దాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతీయ వాయుసేన యుద్ధ విమానాలు రెక్కలు విప్పి గరుత్మంతుడిలా విరుచుకుపడడానికి సమాయత్తం అవుతున్నాయి. దీనికోసం కసరత్తులు షురూ చేశాయి. పాకిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఫైటర్‌ జెట్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ -2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలను రాత్రి వేళల్లో కూడా ల్యాండ్‌ చేసేలా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. డే అండ్‌ నైట్‌ ఫైటర్ జెట్లు ఇక్కగి నుంచి టేకాఫ్‌ తీసుకోవచ్చు. ల్యాండ్‌ అవొచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 4 ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్‌ స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు.

జాతీయ రహదారులను రన్‌వేలుగా మార్చి భారతీయ ఎయిర్‌ఫోర్స్‌ కసరత్తులు చేస్తుండడంతో పాకిస్తాన్‌ వెన్నులో వణుకుపుడుతోంది. యుద్ధం అంటే ఫైటర్‌ జెట్లు, ఆర్మీ, నేవీతో విరుచుకుపడడం మాత్రమే కాదు. ఆర్థిక దాడులతో కూడా పాకిస్తాన్‌ని అతలాకుతలం చేసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పాక్‌పై.. ఫైనాన్షియల్స్‌ స్ట్రైక్స్‌తో భారత్‌ విరుచుకుపడితే.. ఆ దేశం పేకమేడలా కూలిపోవడం ఖాయం. పాక్‌పై రెండు ఆర్థిక అస్త్రాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది భారత్‌. పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో చేర్చడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది భారత్. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి FTF చేరుస్తుంది.

ఈ లిస్టులో ఉన్న దేశాలు.. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్‌, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేయవు. దీంతో పాకిస్తాన్‌లో టెర్రర్‌ నిధులకు అడ్డుకట్ట పడుతుంది. ఇక ఇటీవలే పాకిస్థాన్‌కు 7 బిలియన్‌ డాలర్లు మంజూరు చేసింది IMF. ఆ నిధులను అడ్డుకునేందుకు భారత్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఇక మరోవైపు, పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసియడంతో, ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటోంది. దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు చుట్టూ తిరిగి వెళుతున్నాయి. ప్రయాణ సమయంతో పాటు ఇంధన వినియోగం పెరగడంతో పాక్‌కి నడ్డి విరిగింది. ఇలా అన్ని రకాల వ్యూహాలతో పాక్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaVsPakistan #BigShockToPakistan #IndianAirForce #EconomicStrike #PakistanUnderPressure